నాలుగు వేదాలకు తల్లి గాయత్రి . గాయత్రీ మంత్రం కంటే జపించదగ్గ మంత్రం వేరోకటి లేదు. ఆ గాయత్రీ మాత అనుగ్రహముంటే మనం చేసే ప్రతి పనీ శుభంగా ముందుకు సాగుతుంది.
గాయత్రీ మాతను చూడగానే :-
శ్లో " ముక్తా విద్రమ హేమ నీలధవళ చ్చాయైర్ముఖైస్రీ క్షణై-ః
యుక్తామిన్దు నిబద్దరత్న మకుటాం తత్వార్ధవర్ణాత్మికమ్,
గాయత్రీం వరదాభయాంకు శకశాశ్శుభ్రం కపాలం గదా
శంకం చక్రమధారవిన్దయుగళం హస్తై ర్వహన్తీమ్ భజే !
గాయత్రీ దేవి ముత్యపు వర్ణము (ముక్త), పగడపు వర్ణము (విద్రుమ),బంగారు ఛాయ (హేమ ), నీలి రంగు (నీల), తెల్లని వర్ణము (ధవళ ) గల ఐదు ముఖాలతో వెలుగొందుతూ ఈ పంచవర్ణాల ధ్యానం భౌతిక,మానసిక,బుద్ధి కక్షలపై ప్రభావం చూపుతూ, ముక్తిని కలిగిస్తూ పంచముఖ గాయత్రిగా పేరొందింది. మనకు జ్ఞానాన్ని ప్రసాదింస్తుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆరోగ్య శక్తిని ఇస్తుంది. భక్తిభావాన్ని కలుగజేస్తుంది. ఏ దేవతనైనా గాయత్రీ మంత్రాన్ని స్మరించిగానీ,ఓంకారాన్ని జపించి గాని ప్రసన్నం చేసుకోవచ్చు.
గాయత్రీ అనగా సర్వ దేవతలకు మాతృ స్వరూపిణి, "గాయ " అనగా జీవుడు "త్రి" అనగా త్రికాలమందు జీవులను పోషించేది. ప్రాణులనురక్షించేది గాయత్రి అని కూడా అర్ధం. అందుకే శ్రీకృష్ణుడు గీతలో " యజ్ఞానాం జపయజ్ఞోస్మి " అని చెప్పాడు . అందువల్ల గాయత్రీ మంత్రం పరమోత్కుష్టం. సకల పాపాలను హరింప చేయగల శక్తి ఈ మంత్రం లో ఉంది. గాయత్రీ మంత్రం సర్వ వేదసారం. గాయత్రీ ఉపాసన ద్వారా సమస్త పాపాలనుండి, రోగ, శోకాల నుంచి దారిద్య్రం నుండి విముక్తి చెందుతారు.